అల్లు వంశీ, ఇతి ఆచార్య జంటగా నటించిన చిత్రం పసివాడి ప్రాణం. ఎన్.ఎస్.మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. దర్శక, నిర్మాత మూర్తి మాట్లాడుతూ లైవ్ కం యానిమేషణ్ చిత్రమిది. అప్పటి పసివాడి ప్రాణం చిత్రంలో బాలనటుడుగా ఆకట్టుకున్న సుజిత ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందన్నారు. హీరో అల్లు వంశీ మాట్లాడుతూ నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం కల్పించిన ఎన్‌ఎస్ మూర్తిగారికి రుణపడి ఉంటానన్నారు. ఈ చిత్రంలో సాయి, యోగి, రుబినా, ఎఫ్‌ఎం బాబాయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
