పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్ర హ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మేకర్స్ ముందుగా అప్‌డేట్ ప్రకారం మేకర్స్ బ్రో టీజర్‌ను లాంఛ్ చేశారు. టైమ్ లైన్ విజువల్స్‌తో టీజర్ షురూ అవగా ఏంటిది ఇంత చీకటిగా ఉంది.. ఏవండి ఎవరూ లేరా అని అడుగుతున్నాడు చీకట్లో ఉన్న సాయిధరమ్ తేజ్. హలో మాస్టారు.. గురువుగారు.. హలో తమ్ముడు.. బ్రో అనే డైలాగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండగా.. పవన్ కల్యాణ్ స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. చివరలో సినిమాలు ఎక్కువగా చూస్తావేంట్రా నువ్వు అని సాయిధరమ్ అడుగుతున్నాడు పవన్ కల్యాణ్. సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు సముద్రఖని. వినోదయ సీతమ్ రీమేక్ గా వస్తున్న ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.