Namaste NRI

పవన్ కళ్యాణ్ నూతన చిత్రం ప్రారంభం

పవన్ కళ్యాణ్ హీరోగా  నటిస్తున్న కొత్త సినిమా ఓజీ  (ఒరిజినల్  గ్యాంగ్‌స్టర్‌). ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో  లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దిల్ రాజు చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. గ్యాంగ్‌స్టర్‌  కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు వహిస్తుండగా, తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు.

               అన్నపూర్ణ స్టూడీయోస్‌లో చిత్రయూనిట్ ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. తాజాగా ఈ ఈవెంట్కు పవన్ గ్రాండ్‌గా ఎంట్రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్‌తో  పాటు పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేసారు. ఇక ఈ కార్యక్రమానికి థమన్ కూడా వచ్చాడు. దాంతో ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా థమన్ దాదాపు ఖరారైనట్లే అనిపిస్తుంది.  ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాత స్పందిస్తూ  ఇవాళ మా సంస్థ నిర్మాణంలో పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ మూవీ ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. త్వరలోనే ఓ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇవ్వబోతున్నాం అని అన్నారు. ఈ చిత్రంలోని నాయిక సహా ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.   ఈ  ప్రారంభోత్సవానికి నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, కేఎల్ నారాయణ, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఏఎం రత్నం తదితరులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events