Namaste NRI

పెద్ది సెకండ్ సింగిల్.. రై రై రా రా వ‌చ్చేస్తోంది

రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా చిత్రం పెద్ది. జాన్వీకపూర్‌ కథానాయిక. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేయబోతున్నారు. మార్చి 2వ తేదీన రై రై రా రా అనే రెండో పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్‌ పక్కా మాస్‌ అవతారంలో కనిపిస్తున్నారు. రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఆటకూలీ పాత్రను పోషిస్తున్నారు.

ఏ.ఆర్‌.రెహమాన్‌ స్వరకల్పనలో పాటలన్నీ అద్భుతంగా తయారయ్యాయని, మ్యూజికల్‌గా కూడా బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బొమన్‌ ఇరానీ తదితరులు నటిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌. రత్నవేలు, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సాన.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events