Namaste NRI

పెగాసస్ షాక్.. బ్లాక్ లిస్ట్ లో చేరిన అమెరికా

మొబైల్‌ ఫోన్లపై నిఘా పెట్టే స్పైవేర్‌ పెగాసస్‌ను తయారు చేసిన ఇజ్రాయెల్‌ సంస్థపై అమెరికా చర్యలు చేపట్టింది. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ను బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చింది. విదేశీ ప్రభుత్వాలను అంతర్జాతీయంగా అణచివేసేందుకు ఈ సాధనాలు వీలు కల్పించాయి. అసమ్మతివాదులు, జర్నలిస్టులు, ఇతరులను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుని వారి గళాన్ని నొక్కివేసేందుకు ఈ స్పైవేర్‌ ఒక సాధనంగా మారింది అని అమెరికా వాణిజ్య విభాగం తెలిపింది. అందుకే స్పైవేర్‌ పెగాసన్‌ను తయారు చేసి విక్రయిస్తున్న ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ను పరిమిత కంపెనీల జాబితాలో చేర్చినట్లు వెల్లడిరచింది.  అక్రమంగా ఫోన్లను హ్యాక్‌ చేశారనే విషయంలో భారత్‌ ప్రకంపనలు సృష్టించింది.

                విపక్షాల నిరసనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సైతం పూర్తి స్తంభించిపోయాయి. పెగాసస్‌ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపు తయారు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఓ గ్రూపుతో పాటు నిఘా పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్‌కే చెందిన మరో సంస్థ కాండిరూ ను నియంత్రిత సంస్థల జాబితాలో చేరుస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది. ఈ సంస్థల ఉత్పత్తులు దేశ, విదేశాల్లో అణచివేతకు దారితీశాయని బైడెన్‌ సర్కార్‌ పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events