ఫైజర్ రూపొందించిన యాంటీవైరల్ ఔషధంపై ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఔషధాన్ని ఇతర సంస్థలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి చెందిన ఔషధ విభాగంతో జరిగిన ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపింది. ఈ విభాగానికి లైసెన్సు మంజూరీ చేయడంతో చాలా దేశాల్లో ఈ ఔషధం అందుబాటులోకి వస్తుందని, దాదాపు 95 దేశాలకు ఊరట కలుగనుందని ఫైజర్ అభిప్రాయపడిరది. తాము తయారు చేసిన కొవిడ్ యాంటీవైరల్ ఔషధాన్ని తయారు చేసేందుకు ఐక్యరాజ్యసమితికి చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఫైజర్ వెల్లడిరచింది.
దాదాపు 95 దేశాల్లోని జనరిక్ డ్రగ్స్ సంస్థలు ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపింది. కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోంటున్న తమ ఔషధాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నట్లు మెడిసిన్స్ పేటెంట్ ఫూల్ ప్రతినిధి ఎస్టెబాన్ బర్రోన్ పేర్కొన్నారు. వచ్చే మరికొన్ని నెలల్లోనే ఇతర సంస్థలు ఈ ఔషధాన్ని తయారీని ప్రారంభనున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. అయితే, ఇతర సంస్థలు తమ ఔషధాన్ని తయారు చేసినప్పటికీ వాటి నుంచి తాము ఎటువంటి రాయల్టీని తీసుకోబోమని ఫైజర్ కూడా స్పష్టం చేసింది.














