Namaste NRI

దండోరా మూవీ నుంచి పిల్లా సాంగ్ రిలీజ్

గ్రామీణ తెలంగాణ నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం దండోరా.శివాజీ, నవదీప్‌, నందు, బిందుమాధవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్‌ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుంచి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. దాగి దాగి అలా దగ్గరైపోయావే ఇలా.. పిల్లా ఇట్టసూడవే.. తొంగి నన్ను చూడవే..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, మార్క్‌ కె.రాబిన్‌ స్వరపరిచారు. అదితి భావరాజు, అనురాగ్‌ కులకర్ణి కలిసి ఆలపించారు. ప్రేమికుల మనోభావాలకు అద్దం పట్టేలా ఈ పాట సాగింది. హాస్యంతోపాటు హృదయాలను హత్తుకునే భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు.

క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న సినిమా విడుదల కానున్నది. రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, రాధ్య, అదితి భావరాజు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ ఆర్‌.శాఖమూరి, సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌, నిర్మాణం: లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events