కన్నడ కథానాయకుడు గణేష్ నటిస్తున్న సినిమా పినాక. కొరియోగ్రాఫర్ బి.ధనంజయ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులకు విజుల్ ట్రీట్‌ను ఇచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. రుద్ర, క్షుద్ర పాత్రల్లో హీరో గణేష్ అవతారాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి లోనుచేస్తాయని వారంటున్నారు. మునుపెన్నడూ ఎరుగని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా రూపొందుతున్నదని, అద్భుతమైన విజువల్స్, బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్‌తో సాగే భారీ పీరియాడిక్ డ్రామా ఇదని మేకర్స్ తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో తెలియరానున్నాయ్.