బ్రిక్స్ సదస్సు లో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. బ్రిక్స్ సదస్సుకు ముందుగా కజాన్ లో ఈ ఇరుదేశాల అధినేతల భేటీ జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకుని, పరస్పర సహకారం అందించుకుంటూ అభివృద్ధి చెందాలని సదస్సులో నిర్ణయించారు.
