భారత ప్రధాని నరేంద్రమోదీ ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి అక్కడి భారత సంతతి పౌరులు ఘన స్వాగతం పలికారు. మువ్వన్నెల జెండాలను ప్రదర్శి స్తూ ప్రధానితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం రష్యాతో యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారుల గౌరవా ర్ధం నిర్మించిన డాక్యుమెంటరీని జెలన్‌స్కీతో కలిసి ప్రధాని వీక్షించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధాని నివాళులు అర్పించారు. పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు.