Skip to main content

Namaste NRI

మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులు

భారత ప్రధాని నరేంద్రమోదీ ఉక్రెయిన్‌ లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి అక్కడి భారత సంతతి పౌరులు ఘన స్వాగతం పలికారు. మువ్వన్నెల జెండాలను ప్రదర్శి స్తూ ప్రధానితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం రష్యాతో యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారుల గౌరవా ర్ధం నిర్మించిన డాక్యుమెంటరీని జెలన్‌స్కీతో కలిసి ప్రధాని వీక్షించారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధాని నివాళులు అర్పించారు. పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు.

Social Share Spread Message

Latest News