ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో వచ్చే నెలలో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా చైనా, రష్యా అధ్యక్షులు జీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్ భేటీ కానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం అవుతారని తెలుస్తోంది. సెప్టెంబర్ 15`16 ల్లో సమర్‌కండ్‌లో ఎస్‌సీవో సదస్సు జరుగనున్నది. ఈ సదస్సులో సభ్య దేశాల అధినేతలు పాల్గొంటారా లేదా అన్న విషయమై భారత్, చైనా అధికారికంగా ప్రకటించలేదు. 2020 జనవరి నుంచి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇప్పటి వరకు విదేశీ పర్యటన చేయలేదు. ఒకవేళ ఎస్‌సీవో సదస్సుకు హాజరు కాకపోయినా వర్చువల్ వేదికగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)