మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. ఈ ప్రాంఛైజీలో పొన్నియన్ సెల్వన్-1 గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా పొన్నియన్ సెల్వన్-2 కూడా సిద్దమవుతుంది. లైకా ప్రొడక్షన్-మద్రాస్ టాకీస్ బ్యానర్లు ఫస్ట్ పార్టును మించిన విజువల్స్ తో సీక్వెల్ను తెరకెక్కిస్తున్నాయి. కాగా మేకర్స్ పొన్నియన్ సెల్వన్ -2కు సంబంధించి న్యూ అప్డేట్ అందించారు. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఐమాక్స్ ఫార్మాట్లో కూడా విడుదల కానుందని తెలియజేస్తూ మేకర్స్ కొత్త లుక్ విడుదల చేశారు. సీక్వెల్ ప్రాజెక్ట్లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిషతోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2023 ఏప్రిల్ 28న పొన్నియన్ సెల్వన్ -2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్నట్టు ఇప్పటికే తెలియజేసింది మణిరత్నం టీం.తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
