విష్ణు మంచు నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం. ఈ నేపథ్యంలో ప్రతీ సోమవారం కన్నప్ప చిత్రంలోని ప్రతి పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ స్తున్నారు. ఈ క్రమం లో తాజాగా సోమవారం ఈ సినిమా నుంచి ప్రభాస్ పాత్రను రివీల్ చేశారు. రుద్రుడిగా ఈ చిత్రంలో ప్రభాస్ అలరించబోతున్నారు. ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్రను మేకర్స్ అందరికీ పరిచయం చేశారు. ప్రభాస్ వేషధారణ, లుక్ చూస్తుంటే దైవత్వం ఉట్టి పడేలా కనిపిస్తోంది. ఇందులో శివుడిగా అక్షరు కుమార్, పార్వతీ మాతగా కాజల్ నటిస్తున్నారు. అలాగే మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి హేమా హేమీలూ అందులో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.