Namaste NRI

కన్నప్ప సెట్‏లో అడుగుపెట్టిన ప్రభాస్

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌కుమార్‌ వంటి అగ్ర నటులు భాగమవుతు న్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు.

శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా శివుడి పరమభక్తుడైన కన్నప్ప ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు. అచంచలమైన భక్తి భావానికి, విశ్వాసానికి ప్రతీకలా ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో ప్రభాస్‌ మానవరూపంలోని నందీశ్వరుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress