Namaste NRI

ప్రభాస్ చేతుల మీదుగా ఘాటి రిలీజ్ గ్లింప్స్

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నచిత్రం  ఘాటి.  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వం.  ఈ యాక్షన్ డ్రామా రేపు విడుద‌ల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు, అంటే గురువారం, ప్రత్యేకంగా రూపొందించిన ఘాటి రిలీజ్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయడం విశేషం. అనుష్క-ప్రభాస్ మధ్య ఉన్న బంధాన్ని చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లింప్స్‌లో అనుష్క శెట్టి పవర‌ఫుల్ పాత్రలో అద్భుతంగా క‌నిపించింది. విజువల్స్ గ్రాండియర్, నేపథ్య సంగీతం అన్నికూడా సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి.

ఘాటి చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.ఈ సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జ‌గపతి బాబు, జిషు సేన్‌గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events