ప్రభాస్ కథానాయకుడిగా పోలీస్ పాత్రలో సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత భూషణ్‌కుమార్ స్వయంగా వెల్లడిరచారు. మాస్ కథా నాయకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్ ఇప్పటిదాకా తన కెరీర్లో పోలీస్ పాత్ర చేయలేదు. స్పిరిట్ తో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ రaుళిపించనున్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా స్పిరిట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 25వ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. భాషాభేదాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ ఇదని భూషణ్ కుమార్ తెలిపారు. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రకటన వెలువడిరది.యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరిస్, భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తాయి.














