మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం గాడ్‌ఫాదర్. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా పాట కంపోజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. నయనతార నాయిక. పూరి జగన్నాథ్ అతిథి పాత్రధారి. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌పై చిత్రీకరించే ఓ పాటకు ప్రభుదేవా నేతృత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్ తెలియజేశారు. చిరు, సల్మాన్ కలిసి డాన్స్ చేయడం అభిమానులకు పండగలా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)