రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజారులు, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆమె రాముని విగ్రహం ముందు మోకరిల్లి నమస్కరించారు. అయోధ్య ఆలయ దర్శనానికి ముందు ఆమె సరయు నదికి హారతి కార్యక్రమంలో పూలదండలు సమర్పించారు. అలాగే హనుమాన్ గర్హిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత అయోధ్య ఎయిర్‌పోర్టులో ఆమెకు యూపీ గవర్నర్ ఆనంద్‌బెన్ పటేల్ స్వాగతం పలికారు.