అమెరికా అధ్యక్షుడు ఓ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. శ్వేతసౌధంలో మీడియా సమావేశం నిర్వహించిన జో బైడెన్‌ను ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పీటర్ డూసీ ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశారు. దీంతో బైడెన్ ఒక్కసారిగా నోరుజారి తిట్టారు. మీడియా సమావేశం ముగిసిన వెంటనే ఘటన చోటు చేసుకోవడంతో ఇతర రిపోర్టర్లు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. మధ్యంతర ఎన్నికల వేళ ద్రవ్యోల్బణం అంశాన్ని రాజకీయ బాధ్యతగా భావిస్తారా? అని ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బైడెన్ అసహనానికి గురై ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అన్నారు.
వాస్తవానికి ఫాక్స్ ఛానల్ రిపబ్లికన్లకు అనుకూలంగా ఉంటుంది. బైడెన్ ప్రభుత్వ విధానాలను కూడా కరస్పాడెంట్ పీటర్ డూసీ ఎప్పుడూ తప్పుపడుతూ ప్రశ్నలు వేస్తుంటారు. కానీ అతనిపై నోరు జారిన నేపథ్యంలో ఆ ఘటన జరిగిన గంట తర్వాత బైడెన్ ఆ రిపోర్టర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్ గా తీసుకోవద్దు అంటూ బైడెన్ కోరారని పీటర్ తెలిపారు.














