అమెరికాలో మరో భారతీయ సంతతి వ్యక్తికి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ప్రముఖ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఏటా ప్రకటించే ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (ఈస్ట్ సెంట్రల్) అవార్డుకు ఈసారి ఓహాయో రాష్ట్రానికి చెందిన గతి ఎనలిటిక్స్ వ్యవస్థాపకుడు వంశీ కోరా ఎంపికయ్యారు. సృజనాత్మకత, దైర్య స్థైర్యాలతో వ్యాపార రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మేటీ వ్యాపారవేత్తలను ఈవై సంస్థ ఈ అవార్డుతో సత్కరిస్తుంటుంది. 2022కు గాను ఈ అవార్డు దక్కించుకున్న పది మందిలో వంశీ కోరా ఒకరు. తనకు ఈ అవార్డు దక్కడం పట్ల వంశీ కోరా హర్షం వ్యక్తం చేశారు. ఇది నిజంగా అద్భుతం. ఈ ప్రయాణంలో నాకు కుటుంబం, స్నేహితులు, సాటి ఉద్యోగులు ఎంతో తోడ్పాటునందించారు అని వంశీ కోరార వ్యాఖ్యానించారు.














