Namaste NRI

శ్రీరామ జన్మభూమి స్మారక పోస్టల్‌ స్టాంప్‌లను విడుదల చేసిన ప్రధాని మోదీ

రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ముందు శ్రీరామ జన్మభూమి ఆలయంపై రూపొందించిన స్మారక పోస్టల్‌ స్టాంప్‌లను  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నేడు విడుదల చేశారు. దీంతోపాటు రాముడి చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించారు. ప్రధాని మోదీ మొత్తం ఆరు తపాలా స్టాంపులను విడుద ల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, మా శబరి ఉన్నాయి. అదే విధంగా స్టాంపులతో కూడిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ 48 పేజీల పుస్తకంలో యూఎస్‌, సింగపూర్‌, కెనడా, కంబోడియా సహా 20 కంటే ఎక్కువ దేశాలు విడుదల చేసిన పోస్టల్‌ స్టాంపులు ఉన్నాయి. స్టాంపుల విడుదల సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సందేశం కూడా ఇచ్చారు.

ఈ రోజు శ్రీరామమందిరం ప్రాణ ప్రతిష్టా అభియాన్‌ నిర్వహించిన మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. శ్రీరామ జన్మభూమి మందిర్‌పై రూపొందించిన ఆరు స్మారక పోస్టల్‌ స్టాంప్స్‌, ఆల్బమ్‌ విడుద లైంది. దేశ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events