ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలుసు కదా. అయితే అమెరికా పర్యటనలో భాగంగా మోదీ బస చేసిన హోటల్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. వాషింగ్టన్ డీసీలోని బలార్డ్ హోటల్‌లో ఉంటున్నారు. ఈ హోటల్ 204 ఏళ్ల కిందటిది. 1816లో దీనిని నిర్మించగా ఇప్పటి వరకూ అనేక మార్పులు చేశారు. అమెరికా పర్యటనకు వచ్చే దేశాధినేతలు సాధారణంగా ఇదే హోటల్‌లో బస చేస్తుంటారు. దీంతో ఈ హోటల్ ఎప్పుడూ చాలా ఎక్కువ సంఖ్యలో భద్రతా బలగాల ఉంటాయి. ఈ హోటల్‌లో మొత్తం 9 సూట్లు ఉన్నాయి. వీటిలో కనీసం ఐదింట్లో దేశాధినేతలు వచ్చినప్పుడు బస చేస్తుంటారు. అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్‌ల పేరు మీద కూడా ఇందులో సూట్లు ఉన్నాయి. ఈ హోటల్‌లో బుకింగ్స్ కొన్ని నెలల ముందుగానే చేసుకోవాలి. అమెరికా సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ హోటల్ ఇంటీరియల్ ఉంటుంది.