మోదీ అమెరికా పర్యటన ప్రారంభమైది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చారిత్రక కార్యక్రమం వరల్డ్ యోగా డేకు ప్రధాని నాయకత్వం వహించారు. ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌజ్ ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికింది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చారిత్రక శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత అమెరికా కాంగ్రస్‌లో మోదీ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అనంతరం ప్రధాని మోదీ గౌరవార్థం వైట్ హౌజ్‌లో బైడెన్ దంపతులు స్టేట్ డిన్నర్ ఇచ్చారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-228.jpg)
ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లు, యూఎస్ డ్రోన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత్‌లో జెట్ ఇంజిన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం జరిగింది. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకునేందుకు ఇరు దేశాలు సుముఖంగా ఉండటంతో భారత వైమానిక దళంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను ఉత్పతి చేసేందుకు జి ఇ ఎరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. కంప్యూటరైజ్డ్ స్టోరేజ్ చిప్ప్ తయారీ సంస్థ మైక్రాన్కూ డా గుజరాత్లో సెమీకండక్టర్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-228.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-227.jpg)