భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతమైంది. అమెరికాలో ప్రధాని మోదీ మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం ఢల్లీి విమానశ్రయానికి చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. పలువురు మంత్రులు మోదీకి ఘన స్వాగతం లభించింది. పలువురు మంత్రులు, అధికారులతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రాండ్‌వెల్‌కమ్ చెప్పారు. ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమైనట్టు మోదీ వెల్లడిరచారు. భారత్‌లో విమానం ఎక్కినప్పటి నుంచే ఆయన సమావేశాలు ప్రారంభించారు. విమానంలో కూడా 4 సమావేశాలు జరిపారు. దీన్ని బట్టి సమయానికి మోదీ ఎంత విలువ ఇస్తారో ఇట్టే అర్థం అవుతుంది. భారత్ నుంచి అమెరికా బయలుదేరి మళ్లీ ఇండియాకు వచ్చే ప్రయాణంలో నాలుగు భేటీ పూర్తి చేశారు. అమెరికా వెళ్తున్నప్పుడే రెండు సమావేశాలు నిర్వహించారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ 23న ఐదు సమావేశాల్లో పాల్గొన్నారు. అందులో పలు దిగ్గజ కంపెనీ సీఈవోలతో పాటు యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉన్నారు. ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మూడు అంతర్గత భేటీలు కూడా జరిపారు. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. అదే రోజు క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు. 24వ తేదీన నాలుగు అంతర్గత భేటీలు జరిపినట్టు సమాచారం. 25వ తేదీన అమెరికా నుంచి భారత్‌కు మోదీ తిరిగు ప్రయాణం అయ్యారు.