ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 5న కేదార్‌నాథ్‌ను దర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.250 కోట్లతో చేపట్టిన కేదార్పూరి పునర్మిర్మాణ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. నవంబర్ 7న ప్రధాని మోదీ కేదార్నాథ్ ఆలయంలో పూజలు నిర్వహించడంతో పాటు పునర్నిర్మించిన జగద్గురు ఆదిశంకరాచార్య సమాధితో పాటు రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించిన కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అంతేగాక రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రెండవ దశ కేదార్‌పురి పునర్మిర్మాణ ప్రాజెక్టు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నెలరోజుల్లో ప్రధాని ఉత్తరాఖండ్‌ను దర్శించనుండడం ఇది రెండవసారి. అక్టోబర్ 7న ప్రధాని రిషికేష్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)