ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్‌నాథ్‌లో పర్యటించారు. దేవభూమి ఉత్తరాఖండ్‌లో పవిత్ర ఛార్‌దామ్ యాత్రల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది గురువు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేహ్రాదూన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరాఖండ్ గవర్నర్ లెప్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కేదార్‌నాథ్ చేరుకున్న మోదీ అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేదారీశ్వరుడికి హారతి సమర్పించారు. అనంతరం ఆది శంకరాచార్య సమాధి స్థలం వద్ద ఆగి గురువు 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)