ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. మోదీ సెప్టెంబరు చివరి వారంలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. దేశాధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీకి తొలి పర్యటన కానున్నది. సెప్టెంబర్ 22 నుంచి 27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశమవుతారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2019 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లారు. అప్పుడు ఆయన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. హౌడీ మోదీ ఈవెంట్‌లోనూ ఆయన పాల్గొన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడిన నేపథ్యంలో.. బైడెన్‌తో మోదీ భేటీ కీలకం కానున్నది. బైడెన్ ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులతోనూ మోదీ చర్చిస్తారు. చైనా, ఇండో పసిఫిక్ అంశాల గురించి మాట్లాడనున్నారు.