Namaste NRI

దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్న ఆస్ట్రేలియా ప్ర‌ధాని

ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంథోనీ ఆల్బ‌నీస్  దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఆయ‌న ఆల‌యాన్ని విజిట్ చేశారు. బందీ చోర్ దివ‌స్ సంద‌ర్భంగా కూడా ఆయ‌న త‌ల‌కు పాగా క‌ట్టుకుని గురుద్వారా వెళ్లారు. సిడ్నీ శివారు ప్రాంత‌మైన గ్లెన్‌వుడ్‌లో ఉన్న గురుద్వారాకు ప్ర‌ధాని ఆల్బ‌నీస్ వెళ్లారు. అక్క‌డ ఆయ‌న కొత్త కిచెన్‌ను ప్రారంభించారు. గురుద్వారా స‌భ్యుల‌తో ఆల్బ‌నీస్ ఫోటోల‌కు ఫోజులిచ్చారు. భ‌క్తుల‌తో ఆయ‌న సెల్ఫీలు దిగారు. సిడ్నీలోనే ఉన్న మురుగ‌న్ ఆల‌యాన్ని కూడా ఆయ‌న విజిట్ చేశారు. ఆస్ట్రేలియాలోని త‌మిళ క‌మ్యూనిటీతో ఆయ‌న దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్నారు. మురుగ‌న్ ఆల‌యానికి ప్ర‌తి రోజు ఎంతో మంది విజిట్ చేస్తుంటార‌ని, ద‌క్షిణ ఆసియా హిందూ క‌మ్యూనిటీకి ఇది ముఖ్య ఆల‌య‌మైంద‌ని పేర్కొన్నారు.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events