హమాస్‌తో పోరు విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుపట్టారు. తాను ఇజ్రాయెల్ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బైడెన్ భావిస్తే అది పూర్తిగా తప్పు అని వ్యాఖ్యానించారు. భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజీత్ డోభాల్ నెత న్యాహుతో భేటీ అయ్యారు. యుద్ధం, బందీల విడుదల, మానవతా సాయంలాంటి అంశాలపై చర్చించా రు. అక్టోబరు 7 తరహాలో హమాస్ మళ్లీ ఇజ్రాయెల్‌పై దాడిచేసే ప్రమాదం ఉండకూడదనే ఉద్దేశంతోనే యుద్ధం కొనసాగిస్తున్నామని నెతాన్యాహు తెలిపారు. హమాస్ ఉగ్రవాద ఆర్మీని పూర్తిగా ఏరిపారేస్తామని, రఫాలోనూ సైనిక చర్య ఉంటుందని పునరుద్ఘాటించారు. మరో రెండు నెలలపాటు యుద్ధం కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని హమాస్ నేత ఇస్మాయిల్ హనియే తెలిపారు.














