దుబాయ్ యువరాజు అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దుబాయ్ ఎక్స్పోలో పాల్గొనదలచిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరు రోజుల పాటు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ఎక్సోపోలో పాల్గొనాలని తాము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. ఇందులో వివిధ దేశాల వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులు గురించి తెలుసుకోవాలని ఉత్సకతతో ఉన్నట్టు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)