కరోనా వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో జనవరి 31 వరకు షెడ్యూల్డ్ విమాన సర్వీసుల్ని భారత్ రద్దు చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరో నెల రోజులు పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ కారణంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మనదేశంలో తాజా ఉద్ధృతికి ఈ వేరియంట్ కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)