Skip to main content

Namaste NRI

ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించిన పులిట్జర్‌

పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్‌ పురస్కారం ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్‌ నిఘా వ్యవస్థలు, సైబర్‌ మోసాల వెనుకున్న వ్యవహారాలను లోతుగా అధ్యయనం చేసి, వెలుగులోకి తెచ్చినందుకు ఆర్‌కే ఆనంద్‌, సుపర్ణా శర్మలకు ఈ గౌరవాన్ని అందజేస్తున్నట్టు కొలంబియా యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలుస్ట్రేటెడ్‌ రిపోర్టింగ్‌, కామెంటరీ విభాగంలో వీరిని ఎంపిక చేసింది. ప్రముఖ మీడియా సంస్థకు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి ఈ అవార్డును వారు సంయుక్తంగా అందుకోనున్నారు.

వీరి పరిశోధనాత్మక ప్రాజెక్ట్‌ ట్రాప్డ్‌’ పేరుతో ప్రచురితమైంది. భారతదేశంలో ఒక ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌కు ఎలా బాధితుడిగా మారారో ఈ కథనం కండ్లకు కట్టినట్టు వివరించింది. జర్నలిజం, సాహిత్యం, సంగీత రంగాల్లో కొలంబియా యూనివర్సిటీ ఏటా పులిట్జర్‌ అవార్డులను ప్రకటిస్తుంది. పరిశోధనాత్మక రిపోర్టింగ్‌, పబ్లిక్‌ సర్వీస్‌ జర్నలిజంలో అద్భుత ప్రతిభావంతులకు ఈ అవార్డు ఒక గ్లోబల్‌ బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తారు.

Social Share Spread Message

Latest News