అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. రష్మిక మంధన్నా కథానాయిక. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. పుష్ప మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ను వదిలారు. నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే.. దేశం దద్దరిల్లే అనే లిరిక్స్‌తో సాగే ఈ పాట ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. పుష్పరాజ్ మేనరిజం ఎలా ఉంటుందో చక్కగా వివరిస్తూ ఈ పాటకు చంద్రబోస్ బాణీలు అందించారు. మొదటి పార్ట్‌కు సంగీతం అందించిన రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఎప్పటిలాగే సీక్వెల్‌లోనూ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. పాటలో పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్ అంటూ వచ్చే బిట్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నది. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో అంతలా సక్సెస్ కావడానికి సాంగ్స్ కూడా కీలక పాత్ర పోషించాయి. ఫస్ట్ పార్ట్‌లో సాంగ్స్ ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో సీక్వెల్ లోని సాంగ్స్‌పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన సాంగ్ చూస్తుంటే, పుష్ప 2 కూడా మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టర్ కావడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పుష్ప 2 సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబో బ్రోజెక్, సంగీ తం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్.బి.