Namaste NRI

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీ… ఎప్పుడంటే?

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో అలస్కా వేదికగా ట్రంప్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో కూడా అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యారు. మరో రెండు వారాల్లో పుతిన్‌-జెలెన్‌స్కీ  భేటీ ఉండనున్నట్లు తాజా సమాచారం. చర్చల అనంతరం రష్యా అధినేతతో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు యూరోపియన్‌ నేతలు తెలిపారు. వచ్చే పక్షం రోజుల్లో జెలెన్‌స్కీతో భేటీ అయ్యేందుకు పుతిన్‌ అంగీకరించినట్లు తెలిపారు.

ఇరుదేశాల సంఘర్షణకు తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్‌ నేతలు సమావేశం అయిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం వైట్‌హౌస్‌ వెలుపల జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ జెలెన్‌స్కీతో సమావేశానికి పుతిన్‌ అంగీకరించినట్లు చెప్పారు. అయితే, ఆ భేటీ ఎక్కడ, ఎప్పుడు ఉంటుందన్నది ఇంకా ఖరారు కాలేదన్నారు. మరోవైపు త్రైపాక్షిక సమావేశానికి తాము సిద్ధంగా ఉన్నామని యూరోపియన్‌ నేతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events