ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధగా ఉన్నామని, ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆ దేశ పార్లమెంటుతోనే చర్చలు జరుపుతామని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయని, జెలెన్‌స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదని అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని, తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాయని పుతిన్ చెప్పారు. తాము చెపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతమవుతోందని అన్నారు.