Namaste NRI

పుతిన్ కీల‌క ప్ర‌క‌ట‌న…విదేశీ రేడార్లు మా అణు జ‌లాంత‌ర్గాముల‌ను

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్  కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ వ‌ద్ద ఉన్న అణ్వాయుధ జ‌లాంత‌ర్గాముల‌ను, విదేశీ రేడార్లు గుర్తించ‌లేవ‌న్నారు. ఆర్కిటిక్ మంచు ఫ‌ల‌కాల కింద ప్ర‌యాణించే త‌మ స‌బ్‌మెరైన్ల‌ను గుర్తించే సామ‌ర్థ్యం ఎవ‌రికీ లేద‌న్నారు. స‌రోవ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో న్యూక్లియ‌ర్ సెక్ట‌ర్ వ‌ర్క‌ర్ల‌తో మాట్లాడారు. ర‌ష్యా ర‌క్ష‌ణ అంశంలో ఆర్కిటిక్ ప్రాంతం అత్యంత కీల‌క‌మైంద‌ని పుతిన్ పేర్కొన్నారు. త‌మ వ‌ద్ద ఉన్న వ్యూహాత్మ‌క న్యూక్లియ‌ర్ స‌బ్‌మెరైన్లు, ఆర్కిటిక్ ఐస్ కింద‌కు కూడా వెళ్ల‌గ‌ల‌వ‌ని, అవి రేడార్ల నుంచి త‌ప్పించుకుంటాయ‌ని, ఇది త‌మ మిలిట‌రీ సాధించిన ఘ‌న‌త అని పుతిన్ అన్నారు.

ఆర్కిటిక్ ప్రాంతంలో కొన‌సాగుతున్న ప‌రిశోధ‌న‌లు కీల‌క‌మైన‌వ‌న్నారు. అయితే ఆర్కిటిక్‌లో మంచు కరుగుతున్న కార‌ణంగా,  షిప్పింగ్ రూట్లు ఇప్పుడు మ‌రింత ఎక్కువ యాక్సిస్‌లోకి వ‌చ్చినట్లు ఆయ‌న చెప్పారు. చాలా వ‌ర‌కు దేశాలు ఇప్పుడు ఆర్కిటిక్ దారిని వాడాల‌ని చూస్తున్నాయ‌ని, అలాంటి స‌మ‌యంలో త‌మ‌కు అడ్వాంటేజ్ అవుతుంద‌ని  అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events