
రష్యా అధ్యక్షుడు పుతిన్ తన సలహాదారు మండలి కార్యదర్శిగా అలెక్సీ డైమిన్‌ను నియమించారు. అంతేకాదు తన టీమ్‌లో అతనికి ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ విశ్లేషించిన అక్కడి మీడియా పుతిన్ రాజకీయ వారసుడిగా, రష్యా తదుపరి అధ్యక్షుడిగా అలెక్సీ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. కాగా, ఓసారి పుతిన్ మీదకు ఎలుగుబంటి ఒకటి దాడి చేయడానికి ప్రయత్నిస్తే, బాడీగార్డ్‌గా సేవలందిస్తున్న అలెక్సీ ఎలుగు నుంచి పుతిన్‌ను రక్షించడం గమనార్హం.
