
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందు, భారత్-రష్యా సంబంధాలపై పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక ప్రకటన చేశారు. వాణిజ్యలోటు విషయంలో భారత్ ఆందోళనలు తమకు తెలుసన్నారు. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉగ్రవాదంపై కలిపి పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ తరుణంలో రష్యా నుంచి ఇలాంటి ప్రకటన వెలువడడం గమనార్హం. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, భారత్‌కు చమురు సరఫరా తగ్గకుండా చూసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పెస్కోవ్ తెలిపారు.















