కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల కొవిడ్ టీకాపై ఖతార్ ముందడుగు వేసింది. 5`11 ఏళ్ల వయసు పిల్లల కోసం ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగం కోసం ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపినట్టు వెల్లడిరచింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపిన వివరాల ప్రకారం ఖతార్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య 3.36 లక్షలకు చేరింది. సౌదీ అరేబియా గత ఏడాది నవంబర్‌లో ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.














