బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్ ట్రస్‌ను బ్రిటన్ రాణి ఎలిజబెత్`2 దేశ కొత్త ప్రధానిగా నియమించారు. స్కాట్లాండ్లోని బాల్మోరల్ క్యాజిల్‌లో ఉన్న రాణి ఎలిజబెత్‌తో లిజ్ ట్రస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాణి ఎలిజబెత్ సూచించడంతో అందుకు ట్రస్ అంగీకరించారు. ఇదిలా ఉంటే, అధికార కన్జర్వేటివ్ పార్టీలో అంతర్గతంగా చేపట్టిన నాయకత్వ ఎన్నికల్లో విదేశాంగమంత్రిగా ఉన్న లిజ్ ట్రస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌పై సుమారు 21 వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీంతో 47 ఏళ్ల లిజ్ ట్రస్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)