ప్రభాస్ నటించిన నూతన చిత్రం రాజా సాబ్. మారుతి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈనేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ప్రభాస్ మాట్లాడుతూ నా ఫ్యాన్స్ అందరికీ హారు, ఈ మధ్యే జపాన్‌లో ఫ్యాన్స్‌ను కలిసినప్పుడు ఇలాగే హ్యాపీగా ఫీలయ్యా. మీ అందరి కోసం కొత్త హెయిర్ స్టైల్‌లో వచ్చా. అనిల్ తడానీ నా బ్రదర్ లాంటి వారు. ఆయన నా సినిమాలకు నార్త్‌లో సపోర్ట్ చేస్తుంటారు. సంజయ్ దత్‌కి క్లోజ్ షాట్ పెడితే సీన్ మొత్తం తినేస్తారు, ఇది నానమ్మ, మనవడి కథ. జరీనా వాహబ్ నాకు నానమ్మ క్యారెక్టర్‌లో నటించారు. నాతో పాటు ఆమె కూడా ఇందులో హీరోనే. రిద్ధి, మాళవిక, నిధి ముగ్గురూ తమ పర్‌ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటారు. ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ పెరిగింది. అయినా ఎంతో ధైర్యంగా విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ రేంజ్ హర్రర్ ఫాంటసీ సినిమాకు తమన్ మాత్రమే మ్యూజిక్ చేయగలడు అనిపించింది. మా డీవోపీ కార్తీక్ ఎంతో స్పీడ్‌గా క్వాలిటీగా మూవీ చేశారు. సొలమన్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మూడేళ్ల స్ట్రెస్, బాధ్యత అన్నీ కలిసి మారుతికి కన్నీళ్లు వచ్చాయి. ఈ మూవీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి మారుతి రైటింగ్‌కు నేను ఫ్యాన్ అయ్యాను. హర్రర్ కామెడీలోనే కాదు ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. సీనియర్స్ సీనియర్సే, వాళ్ల దగ్గరనుంచే మేము నేర్చుకున్నది. సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావాలి అని అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ రాజా సాబ్ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్, మరొకరు విశ్వప్రసాద్. ప్రభాస్‌తో మేము ఏదో సినిమా చేశాం అనిపించుకోకుండా ఒక పెద్ద స్పాన్ మూవీ చేశాం. ఈ జోనర్‌లో మంచి పొటెన్షియాలిటీ ఉంది. దాన్ని మేము మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నాం. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నా విశ్వప్రసాద్ చాలా ధైర్యంగా దీన్ని తీసుకొస్తున్నారు. అన్ని భాషల్లో ఈ సినిమా సాధించే విజయం మామూలుగా ఉండదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్, తమన్, ఎస్‌కేఎన్, కథానాయికలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లతోపాటు నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ, నటులు రోహిత్, సప్తగిరి, మ హేశ్, వీటీవీ గణేశ్, గేయ రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.















