ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రభాస్‌ను ఓ హిప్నాటిస్ట్ భారీ హవేలీలోకి తీసుకెళ్లే సన్నివేశంతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. అక్కడ ఓ వింత ఆకారాన్ని చూసిన ప్రభాస్ తాత రండి..పరిచయం చేస్తా అని చెప్పడం..ఆ తర్వాత భయంతో మరి చూస్తారేంటిరా పరుగెత్తండి అనే డైలాగ్‌తో చక్కటి కామెడీని పండించారు. అద్భుతాలు చూసి ఆనందించాలి.క్వశ్చన్ చేయకూడదు. ఏదో గుర్తుండిపోయే పనిచేయాలి. ఏంట్రా ఇలాంటి పని చేశాడని అందరూ షాక్ అయిపోవాలి అంటూ ప్రభాస్ చెప్పిన సంభాషణలు నవ్వించాయి. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు రొమాంటిక్, ఫన్ సీన్స్ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్ మెస్మరైజింగ్‌గా అనిపించాయి. ప్రభాస్ వింటేజ్ ైస్టెల్‌లో కనిపించారు.చివర్లో ఏందిరా మీ బాధ..పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా..రాక్షసుడిని అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్‌దత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: మారుతి.
















