Namaste NRI

పురుషోత్తముడిగా రాజ్‌తరుణ్‌.. ట్రైలర్‌ విడుదల

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పురుషోత్తముడు. హాసిని సుధీర్ క‌థానాయిక‌.  ఈ సినిమాకు రామ్‌ భీమన దర్శకత్వం.  శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్‌ తేజావత్‌, ప్రకాష్‌ తేజావత్‌ నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో మురళీశర్మ, కౌసల్య, ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

ఒక గ్రామం కోసం.. అందులో ఉన్న ప్ర‌జ‌ల‌ కోసం డబ్బున్న ఒక కుర్రాడు.. తన అంతస్తును, హోదాను పక్కన పెట్టి ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. చూస్తుంటే మ‌హేశ్ బాబు శ్రీమంతుడు వైబ్‌లు వ‌స్తున్న కొత్త‌గా ఉంది. ఇక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమా టీజ‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుం టుంది. ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.   ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: గోపీ సుందర్‌, రచన-దర్శకత్వం: రామ్‌ భీమన.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress