రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా పెద్ది. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో శరవేగంగా సాగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆహ్వానంతో రామ్ చరణ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో చరణ్, సిద్ధరామయ్యకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా సీఎం కూడా రామ్ చరణ్‌కి ఆత్మీయ స్వాగతం పలికారు.

ఇక సిద్ధరామయ్య పెద్ది సినిమా గురించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైసూర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న విషయమై కూడా మాట్లాడినట్టు సమాచారం. ఇక జానీ మాస్టర్ సినిమాకి సంబంధించిన పాటని కొరియోగ్రఫీ చేస్తుండగా, ఇందులో సుమారు 1000 మందికి పైగా డాన్సర్లు పాల్గొంటున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో డాన్సర్లతో ఈ సాంగ్‌ని చిత్రీకరిస్తుండడం విశేషం.
















