బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో రామ్‌చరణ్ సినిమా చేయబోతన్నట్లు వార్తలొస్తున్నాయి. గత కొంతకాలంగా తరచూ చరణ్ ముంబై వెళ్లడం వెనుకున్న రీజన్ ఇదే అంటున్నారు. సంజయ్ హిస్టారికల్స్ తీయడంలో దిట్ట. చరణ్‌తో చేబోతున్న సినిమా కూడా హిస్టారికల్ మూవీనే అని తెలిసింది. శ్రావస్టి సామ్రాజ్యా నికి చెందిన ఓ చక్రవర్తి, తన కొద్దిమంది సైన్యంతో ఘాజీ సలార్ మసూద్‌ని ఓడించి మట్టికరిపించిన వీరోచిత గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందించనున్నట్టు సమాచారం. త్వరలో రామ్‌చరణ్‌ని చరిత్రపురుషునిగా చూడబోతున్నాం అన్నమాట.
