ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో ఘనంగా నిర్వహించనున్నారు. జులై 7, 8, 9 తేదీల్లో జరగబోతున్న ఈ కార్యక్రమానికి రాజకీయ, అతిథివక్తగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడిని ఆహ్వానించారు. ఈ మేరకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, మహాసభల కో ఆర్డినేటర్ రవి పొట్లూరి ఆయనకు లేఖ రాశారు. ఈ సందర్భంగా రమేశ్ నాయుడు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా విదేశాల్లో స్థిరపడినప్పటికీ తెలుగు వారి జీవన విధానానికి, సాంస్కృతిక వైభవానికి, భవిష్యత్ తరాలకు వారధిగా పనిచేస్తున్న తానా నుంచి ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తానా మహాసభల్లో ప్రత్యేకంగా జీ20 అంశంపై ప్రసంగించనున్నట్లు తెలిపారు.



