ఆసియా `పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలోని భారత దేశ నగరాల్లో మూడో స్థానంలో ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. యాక్టివ్ క్యాపిటల్ ఏసియా పసిఫిక్`రైజింగ్ క్యాపిటల్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్ పేరుతో ఒక జాతితా విడుదల చేసింది. పట్టణీకరణ ఒత్తిడి, వాతావరణ ప్రమాదం, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ కార్యక్రమాల ఆధారంగా 36 నగరాలకు రేటింగ్ ఇచ్చింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సింగపూర్, సిడ్నీ, వెల్లింగ్టన్, పెర్త్, మెల్బోర్న్ వంటి నగరాలు వాణిజ్య రియల్ ఎస్టేట్లో మొదటి ఐదు గ్రీన్`రేటెడ్ నగరాల జాబితాలో ఉన్నాయి.














