Namaste NRI

ఎన్నారై యూసఫ్ అలీకి అరుదైన గౌరవం

ప్రముఖ వ్యాపారవేత్త, లులు గ్రూపు అధినేత, ఎన్నారై ఎంఏ యూసప్‌ అలీకి అరుదైన గౌరవం దక్కింది. భారీగా పెట్టుబడులతో సంస్థలను నెలకొల్పడంతో పాటు భారీ మొత్తంలో దేశ పౌరులు, నివాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించిన సుమారు 21 మంది విదేశీ పారిశ్రామిక వేత్తలను తాజాగా ఒమన్‌ సర్కార్‌ లాంగ్‌ టర్మ్‌ రెసిడెన్సీ వీసాలతో సత్కరించింది. వీరిలో ఎన్నారై యూసఫ్‌ అలీకి చోటు దక్కింది. ఒమన్‌ వాణిజ్య, పరిశ్రమ పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి చేతుల మీదుగా ఆయన వీసా అందుకున్నారు. ఇన్వెస్టర్‌ రెసిడెన్స్‌ కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు ఒమన్‌ సుల్తానేట్‌ ఈ అవకాశం కల్పిస్తోంది. తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల యూసఫ్‌ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ఒమన్‌ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events