
బ్లాక్ బస్టర్ మూవీస్‌తో పాన్ ఇండియా క్వీన్‌గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. ఆమె మరోసారి తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన విషాదం పట్ల హీరోయిన్ రష్మిక మందన్నా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వందలమంది ప్రాణాలు కోల్పోవడంతో దిగ్భ్రాంతికి గుర య్యాను. ఈ కష్టకాలంలో కేరళ ప్రజలంతా మనోధైర్యంతో మెలగాలి. దేవుడు అందర్నీ ఆదుకుంటాడు అంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పింది రష్మిక. అంతేకాకుండా తనవంతు సాయంగా కేరళ సీఏం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది. దీంతో రష్మిక మంచి మనసుకు అందరూ ఫిదా అయిపో తున్నారు. రష్మికే కాదు, రష్మిక మనసు కూడా అందమైనదేనంటూ కితాబులిస్తున్నారు.
